ఉత్తరాయణం

ఈ నెల 15 నుండి ఉత్తరాయణం మొదలవుతోంది....ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకో కూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే..అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు…ఆయనం అనగా పయనించడం అని అర్ధం.ఉత్తర ఆయనం అంటే ఉత్తర వైపుకి పయనించడం అని అర్ధం.సూర్యుడు భూమికి కొంత కాలందక్షిణం వైపు పయనించడంతరువాత దక్షిణం వైపు నించిఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది.సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడుదక్షిణాయణం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలోమార్పులు సంభవిస్తుంటాయి.సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపుఅనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒక వైపు అనగా;ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు.సాధారణం గా ఉత్తరాయణం జనవరి 15 నుండి జూలై 17 వరకు వుంటుంది. . (ఒక రోజు అటూ ఇటూ కావచ్చు) దక్షిణాయణం జూలై 17 నుండి జనవరి 14 వరకు వుంటుంది. (ఒక రోజు అటూ ఇటూ కావచ్చు)ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు..ఈ కాలం లో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలనపుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది....మనం ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూవేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ,హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికతఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ,సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ,సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటంవల్లనూ, ముఖ్యం గా;ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ,ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలం గా హిందువులు భావించారు.కురుక్షేత్ర యుద్ధం లో అంపశయ్య పై ఒరిగిన భీష్ముడు ఉత్తరాయణ పుణ్య కాలం వచ్చిన తరువాతనే ప్రాణాలు వదిలాడు.ఈ ఉత్తరాయణ కాలం లోనే చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి,పుష్పించి,కాయలుకాచి మధురఫలాలు అందిస్తాయి.ఈకాలం లోనే పసిపాపలు ఎక్కువగా జన్మిస్తారు...ఎక్కువగా ఈ కాలం లోనే కుమారీ మణులు పుష్పవతులు అవుతారు.స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది ఈ కాలం లోనే....బహుశా ఇన్ని కారణాల వల్ల ఉత్తరాయణ కాలం పుణ్య కాలం అయింది.ఉత్తరాయణ పుణ్య కాలం ఈ నెల 15 నుండి ప్రారంభం .

Comments

Popular posts from this blog

Jambu dweepe bharata varshe Abstract

SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM

నూతన యజ్ఞోపవీత ధారణ విధి & నిత్య త్రికాల సంధ్యా వందనము