శ్రీ ఆంజనేయ దండకము
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం భజేవాల గాత్రం భజే హం పవిత్రం భజేబ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీై నామ సంకీర్తనల్ చేసి,నీరూపు వర్ణించి నీ మీద నేదండకం బొక్కటింజేయ నూహించి నీమూర్తిగావించి నీ సుందరంబెంచి నీదాసదాసానుదాసుండనై భక్తుండునై నిన్ను నేగొల్చెదన్ నీకటాక్షం బునన్ జుచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనంతవాడన్ దయాశాలివై జూచితే బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవునకు న్మంత్రివై స్వామి కార్యంబు నందుండి శ్రీరామ సౌమిత్రీలంజూచి వారి న్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజంబంటు గావించి యవ్వాలినిం జంపి కాకుత్థ్సతిలకం దయాదృష్టి వీక్షించి కిష్కింధ కేతెంచి శ్రీరామ కార్యర్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియూన్ భూమిజం జూచియాన్ ద ముప్పొంగ యాయీంగరంబిచ్చి యారత్నమున్ దేచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునిన్ జేసి సుగ్రీవుడున్ అంగదూన్ జాంబవంతాది నీలాదులంగూడి యా సేతువున్ దాటి యావానరామూక పెన్మూకలై దైత్యులం దృంచగా రావణుండంతకాలాగ్ని యుగ్రుండునై కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి యాలక్ష్మణున్ మూర్ఛ నొందించగా నప్పుడే బోయి సంజీవియుందెచ్చి కుంభకర్ణాది వీరాళితో భోరి చెందాడి శ్రీ రామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమైయుండ నవ్వేళ యవ్విభీషణున్వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరుం గూర్మి లేరంచు మన్నించినన్ రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనల్జేసితే పాపముల్బాయునే భయములు న్దీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యము స్సకల సంపత్తులుం గల్గునే యోవానరాకార యో భక్తమందార యోపుణ్యసంచార యోధీర యోవీర సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి యాతారక బ్రహ్మమంత్రంబు పఠియచుచున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి శ్రీ రామ శ్రీరామ శ్రీరామయంచున్ మనః పూతమై యోప్పుడున్ తప్పకన్ దలతు నాజిహ్వయందుండి నీదీర్ఘ దేహంబు త్ర్రైలోక్య సంచారివై రామానామాంకిత ధ్యానివై యాబ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర కల్లోలహావీర హనుమంత ఓంకారశబ్దంబులున్ భూతప్రేత పిశాచ శాకినీ ఢాకినీ గాలిదెయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టినేలంబడంగొట్టి నీ ముష్టి ఘాతంబులన్ బహుదండంబులన్ రోమ ఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రండవయి లోకముల్ గాచితే బ్రహ్మతేజ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబులన్ జూచి రారానాముద్దు నరసింహయంచున్ స్తుతింపంగ గాంక్షించితిన్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామి నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే వ్రతా పూర్ణకారీ నమస్తే వాయుపుత్రా నమస్తే నమస్తే నమస్తే నమోనమః
{ఈ దండకమును నిష్టతో పఠించినట్లయిన సర్వ పాపములు నశచును.భయబాధలుండవు.భాగ్యములుగలుగును. భూతప్రేత పిశాచోరగ శాకినీ ఢాకినీ గాలి దయ్యంబులు దగ్గరకు చేరవు నిద్రించునపుడు దిండు క్రింద ఉంచుకన్నచో దుస్వప్నములు రావు }
Comments
Post a Comment