* హరిద్వార్ అర్ధ కుంభమేళా ప్రారంభం
ఉ త్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌లో గురువారం మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన అర్ధ కుంభమేళా ఏప్రిల్ 22 వరకు కొనసాగనుంది. ప్రపంచంలో మరేది సాటిరాని ఒక విశిష్ట ఆధ్యాత్మిక సమ్మేళనం కుంభమేళా. ఈ సందర్భంగా లక్షలాది హిందువులు పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు చేస్తారు. పురాణాల్లోని దేవ దానవుల క్షీరసాగర మథనం, అమృతోద్భవ ఘట్టంతో కుంభమేళా నేపథ్యం ప్రారంభమవుతుంది. అసురులకు అమృతం దక్కకుండా దేవతలు దాన్ని ఒక కుంభం(కుండ)లో దాచిపెడతారు. అమృతం కోసం దానవులు దేవతలను వెంటబడి తరుముతారు. ఈ క్రమంలో కుండ నుంచి కొన్ని అమృతం చుక్కలు భూమిపై ఉన్న హరిద్వార్, ప్రయాగ(అలహాబాద్), ఉజ్జయిని, నాసిక్‌లలో పడ్డాయంటారు.
అందుకే ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో 12 ఏళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. అయితే హరిద్వార్, ప్రయాగ(అలహాబాద్)ల్లో మాత్రమే కుంభమేళా అనంతరం ఆరేళ్లకు అర్ధకుంభమేళా జరుపుతారు.
* పుణ్యస్నానాలకు ముఖ్యమైన రోజులు
* జనవరి 14 (గురువారం) మకర సంక్రాంతి
* ఫిబ్రవరి 08 (సోమవారం) సోమ్‌వతి అమావాస్య
* ఫిబ్రవరి 12 (శుక్రవారం) వసంత పంచమి
* ఫిబ్రవరి 22 (సోమవారం) మాఘ పౌర్ణమి
* మార్చి 07 (సోమవారం) మహాశివరాత్రి
* ఏప్రిల్ 07 (గురువారం) చైత్ర అమావాస్య
* ఏప్రిల్ 08 (శుక్రవారం) చైత్ర శుక్ల ప్రతిపద(పాఢ్యమి)
* ఏప్రిల్ 14 (గురువారం) మేష సంక్రాంతి
* ఏప్రిల్ 15 (శుక్రవారం) శ్రీరామనవమి
* ఏప్రిల్ 22 (శుక్రవారం) చైత్ర శుక్ల పౌర్ణమి
chala manchi vishayalu telipinaru dhanyawadamu telugu satram haridwar annadanam.in
ReplyDelete