Posts

Showing posts from 2016

SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM

SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM రచన: ఆది శంకరాచార్య శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే | యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 1 || బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత | లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 2 || సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య | త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 3 || సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య | ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 4 || సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య | దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 5 || సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ | ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 6 || సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః | నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 7 || సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం క

దశ మహావిద్యలు

దశ మహావిద్యలుతంత్ర శాస్త్రంలో ప్రప్రదమంగా చప్పుకో దగినవి దశమహావిద్యలు. దశమహావిద్యలు అని పేర్కొనబడిన మంత్రవిద్యలకు 10 మంది దేవతలు అధిపతులుగా ఉన్నారు. దక్షిణాచారము లేదా వామాచారము అని పిలువబడే తాంత్రిక విధానాలు అదర్వణవేదం నుండి తీసుకొనబడ్డాయి.ఒక మంత్ర దేవత మానవ రక్షణకు మరియు నాశనానికి కూడా ఉపయెాగించటం జరుగుతుంది.పరమ శివుని భార్య అయిన సతీదేవి తండ్రి దక్షప్రజాపతి తలపెట్టిన యజ్ఙంకు వెళ్ళుటకు నిర్ణయించుకునిపరమ శివునితో చెప్పగా, శివుడు దక్షప్రజాపతి ఆంతర్యము ఎరిగినవాడై పిలుపు లేని చోటుకు వెళ్ళరాదని వారించెను. వెంటనే సతీదేవి కోపంతో పరమ శివునికి తన నిజరూపమైన ఆదిపరాశక్తి అవతారము దాల్చి మహా శివుని ముందు తన శక్తితో 10 అవతారాలతో 10 వైపులా శివుని అడ్డుకుంది.ఈ 10 అవతారాలే దశమహావిద్యలు. ప్రతి అవతారమునకు ఒక పేరు, కధ, లక్షణము మరియు మంత్రము కలదు.ఈ 10 అవతారాలతో ఆదిపరాశక్తి పరమశివుడిని 10 దిక్కులా బంధించి తన శక్తిని చూపించింది.ఈ అవతారాలలో అమ్మవారు ఒక వైపు భయంకర రూపంతో కనిపిస్తూనే మరోవైపు అందమైన శక్తి స్వరూపిణిగా సర్వ విద్యలకు అధినాయకిగా చెప్పబడినది.దశమహావిద్యలు పేరుకు తగ్గట్టుగ అపారమైన జ్ఙాన మూర్తులుగా తెలుప

బ్రాహ్మి ముహూర్తం

బ్రాహ్మి ముహూర్తం లో ఎందుకు లేవాలి?పెద్దలు అందరు చెప్తూ ఉంటారు-----బ్రాహ్మి ముహూర్తం లో నిద్ర లేవాలి అని. అలా ఎందుకు. అసలు బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి? సుర్యొదయమునకు 48 నిముషముల ముందు ఉన్న సమయమును బ్రాహ్మి ముహూర్తం అంటారు. అంటే రాత్రిభాగము లోని ఆఖరి 48 నిముషములు అన్నమాట. ఈ సమయము పూజలకు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయముగా చెప్తారు.ముఖ్యంగా విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తం లో లేచిచదువుకుంటే చదువు బాగా వస్తుంది అని అంటారు. దేనికి వెనుక ఏదైనా రహస్యంఉందా? అంటే విశ్లేషిస్తే పెద్ దగా ఏమి లేదు. మన శరీరం లో ఒక జివ గడియారం ఉంటుంది. (virtual clock ) దీనిని అనుసరించే మన జీవక్రియలు అన్ని జరుగుతాయి. ఆ ప్రకారం ఉదయపు వేళల్లో మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడి ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. అందువలన ఆ సమయములో చదువుకుంటే పిల్లలకు మంచిది. చదివిన పాఠాలన్నీ చక్కగా గుర్తు ఉంటాయి. అంతకు ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాము కాబట్టి మెదడు ఉత్తేజం తో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దం గా ఉంటాయి. ఈ అన్ని కారణ

Yajurvedam in Telugu

Yajur Vedam In Telugu

శివాభిషేక ఫలములు

ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు.....!!ఈ విషయంపై శివపురాణం ఓసారి తిరగేస్తే.. అందులో శివుడు ఎనిమిది రూపాలు ధరించినట్టు పేర్కొంటోంది.అవేంటంటే...రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అధిష్టించి ఉంటాడు.శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు.భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైనజలాన్ని ఆశ్రయించి ఉంటాడు.ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడైన వాయువును అధిష్టించి ఉంటాడు.భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు.పశుపతి : సంసారబద్ధులైన జీవులను పాపవిముక్తులను చేసేం దుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు.ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునిలో ప్రకాశిస్తుంటాడు.మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు.శివాభిషేక ఫలములు......1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.7 మెత్తని చేక్క

నమకం విశిష్టత

నమకం విశిష్టత ........!!!నమకం, చమకం 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని "అనువాకం" అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడినితన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయిదాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.అనువాకం – 1:తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.అనువాకం – 2 :ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.అనువాక

vedas

1 The Four Vedas Rigveda contains mainly mantras in praise of various vedic deities and prayers to them. It is divided in two ways. 8 ashtakas comprising of 64 adhyayas ORversesverses 10 mandalas comprising of 85 anuvakas in total there are 1028 suktams made up of 10552 mantras. A suktam is a collection of mantras on a particular subject. Originally there were 21 branches of this veda, but now only to i.e.:- Bhashkala and Sakala are in existing. The sub texts of this veda are Brahmanas ( procedural instructions) - Kaushitaki, Sangrayana and Aithareya Aranyakas - Kaushitaki and Aithareya Upanishads - Kaushitaki and Aithareya Gruhya sutra - Asvalayana Yajurveda There are two schools of yajurveda. The shukla yajurveda and the krishna yajurveda. The main difference is that in shukla yajurveda we find mantras alone whereas krishna yajurveda is a mix of mantras and the relevant brahmana bhaga also. Yajurveda consists mainly of procedural mantras used in yajnas and it is

బోగి పండ్లు

బోగి పండ్లురేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కలవున్న చెట్లనుంచి ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతార ంటారు. భోగినాడు పెద్దవారుపిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతోబాటు ఆనారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.రేగి పండు భారత ఇతిహాసంలో…. భారత నాగరికతలో….. పూజలలోను పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో రేగి పండు ఒకటి. రేగిపండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు బోగి పండ్లు పోయాలి అని అంటుంటారు అవి కూడ రేగి పండ్లే.సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున “భోగి” పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అం

గోమతిచక్రాలు

అరుదైన సహజసిధ్ధంగాలభించే సముద్రపు ఉత్పత్తి. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి ది నందు లభిస్తాయిగోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది.దీనినే “నాగ చక్రం” అని “విష్ణు చక్రం” అని కూడ అంటారు. ఇది నత్త గుళ్ళ ని పోలి ఉంటుంది.అందువల్ల దీనిని “నత్త గుళ్ళ “స్టోన్ అని కూడ అంటారుగోమతిచక్రాలు అన్నిరకాల పూజా కార్యక్రమాలకి,సకల కార్యసిధ్ధికి,ఆరోగ్య సమస్యలకి,ధరించటానికి ఉపయోగపడతాయి.ఎర్రగాఉన్న గోమతిచక్రాలు వశీకరణానికి,శత్రునాశనానికి,క్షుద్రప్రయోగాలకి,తాంత్రిక ప్రయోగాలకి మాత్రమేఉపయోగించాలి.గోమతిచక్రాలలో ఆరు,తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి . సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి,తొమ్మిదికుజ గ్రహానికి చెందుతాయి.జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలోవిఫలం కావటం,వివాహాం అయిన తరువాతరతికి ఆసక్తిని కనబర్చకపోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణవల్లనివారించబడతాయి.పూజా విధానం:-గోమతి చక్రాలను సిధ్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో గాని పసుపు నీళ్ళతో గాని కడిగి పరిశుబ్రమైన బట్టతోతుడవాలి.గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా అష్ట లక్ష్మీ యంత్రం గాన

ఉత్తరాయణం

ఈ నెల 15 నుండి ఉత్తరాయణం మొదలవుతోంది....ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకో కూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే..అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు…ఆయనం అనగా పయనించడం అని అర్ధం.ఉత్తర ఆయనం అంటే ఉత్తర వైపుకి పయనించడం అని అర్ధం.సూర్యుడు భూమికి కొంత కాలందక్షిణం వైపు పయనించడంతరువాత దక్షిణం వైపు నించిఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది.సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడుదక్షిణాయణం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అం టారు.సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలోమార్పులు సంభవిస్తుంటాయి.సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపుఅనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒక వైపు అనగా;ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు.సాధారణం గా ఉత్తరాయణం జనవరి 15 నుండి జూలై 17 వరకు వుంటుంది. . (ఒక రోజు అటూ ఇటూ కావచ్చు) దక్షిణాయణం జూలై 17 నుండి జనవరి 14 వరకు వుంటుంది. (ఒక రోజు అటూ ఇటూ కావచ్చు)ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు..ఈ కాలం లో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలనపుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది....మనం ఉత్తర దిక్కునూ, ఉత్

శ్రీ ఆంజనేయ దండకము

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం భజేవాల గాత్రం భజే హం పవిత్రం భజేబ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీై నామ సంకీర్తనల్ చేసి,నీరూపు వర్ణించి నీ మీద నేదండకం బొక్కటింజేయ నూహించి నీమూర్తిగావించి నీ సుందరంబెంచి నీదాసదాసానుదాసుండనై భక్తుండునై నిన్ను నేగొల్చెదన్ నీకటాక్షం బునన్ జుచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనంతవాడన్ దయాశాలివై జూచితే బ ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవునకు న్మంత్రివై స్వామి కార్యంబు నందుండి శ్రీరామ సౌమిత్రీలంజూచి వారి న్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజంబంటు గావించి యవ్వాలినిం జంపి కాకుత్థ్సతిలకం దయాదృష్టి వీక్షించి కిష్కింధ కేతెంచి శ్రీరామ కార్యర్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియూన్ భూమిజం జూచియాన్ ద ముప్పొంగ యాయీంగరంబిచ్చి యారత్నమున్ దేచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునిన్ జేసి సుగ్రీవుడున్ అంగదూన్ జాంబవంతాది నీలాదులంగూడి యా సేతువున్ దాటి యావానరామూక పెన్మూకలై దైత్యులం దృంచగా రావణుండంతకాలాగ్ని యుగ్రుండునై కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి యాల

నైవేద్యము అంటే ఏమిటి?

ఓం నమో బ్రహ్మాదిభ్యో, బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో, వంశ ఋషిభ్యో నమో గురుభ్య: నైవేద్యము అంటే ఏమిటి? నివేదింప తగిన, సమర్పింప తగిన వస్తువు, పదార్ధము. భగవంతునికి నివేదించే పదార్ధము. అది వస్తువే వుండ వలసిన అవసరము లేదు. మన మనస్సును కూడా నివేదించ వచ్చు. మనము తినే ఆహారమును భగవంతునికి పెడితే, ఆ పెట్టె విధానమును నైవేద్యము అని అంటారు, ఆయన తినిన తరువాత ఆయన ఉచ్చిష్టము మనకు ప్రసాదము అవుతుంది. అదే మనము ముందు తిని ఆయనకు పెడితే ఎంగిలి అవుతుంది.అలా చేయ కూడదు . భగవంతుని కి నివేదించిన పదార్ధము మనకు ప్రసాదము అవుతుంది. ఆ ప్రసాదము మనము భక్తితో తిన వలెను. మనము తినే ఆహారమును శుచిగా, మడిగా వండి భగవంతునికి నివేదన చేయ వలెను. ఒక్కో దేవతకు ఒక్కో వస్తువు ప్రీతి. విశేష దినములలో ఆ రకముగా పిండి వంటలు చేసి భగవంతునికి ఆరాధన చేయ వలెను. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం మహేశ్వరీ ..... అని నివేదన చేయ వలెను. మరి ఈ నివేదన ఎలా చేయాలి? వండిన పదార్ధములను అన్నీ ఒక పళ్ళెములో (అది మనము తినే పళ్ళెము వుండ కూడదు) లేదా ఒక విస్తరాకులో అన్నీ వడ్డించి తీసుకొని రావలయును. దాని మీద ఆవు నెయ్యిని అభ

ఆచమనం అంటే ఏమిటి?

Image
..పూజలు, వ్రతాల్లో ''ఆచమనం'' అనే మాట చాలాసార్లు వింటాం. కానీఆ పదానికి అర్ధం చాలామందికి సరిగా తెలీదు. అందుకే ''ఆచమనం''అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటోఇప్పుడు తెలుసుకుందాం.ఆచమనం అనే ఆచారం అపరిమితమైనది. ఉదయం లేచిందిమొదలు రాత్రి పడుకునే వరకూ రోజులో అనేకసార్లు చేయొచ్చు,చేయాలి. ముఖ ప్రక్షాళన అయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత,పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు,భోజనానికి ముందు, తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చినతర్వాత ముఖం, కాళ్ళూచేతులూ కడుక్కున్న తర్వాత – ఇలాఎన్నిసార్లు అయినా ఆచమనం చేయొచ్చు.ఆచమనం ఎవరైనా, ఎపుడైనా చేయొచ్చు కానీ, చేసే వ్యక్తి శుచిగా,శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పునమంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి.ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవిఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని (ఒక మినపగింజమునిగేంత పరిమాణంలో నీళ్ళు) పోసి, వాటిని తాగాలి. చేతిలో పోసేనీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడద

దర్భ యొక్క ప్రాముఖ్యం

Image
మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భనుశుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువుశరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉం

ఉపనయనము:

కుమారునికి తండ్రి ఉపనయనం చేస్తాడు. తండ్రి దేశాంతరమందుంటే తాత (తండ్రి యొక్క తండ్రి), అతను లేకుంటే తండ్రి సోదరులు వారుకూడా లేకపోతే వటుడి అన్న దానికి అధికారి అవుతాడు. ఒకవేళ అతను కూడా లేకపోతే సగోత్రమునందు పుట్టినవారు చేయాల్సిఉంటుంది. ఏ వయసులో చెయ్యాలి? బ్రాహ్మణ కులంలో 8వ సంవత్సరాన, క్షత్రియులకు 11వ ఏడున, వైశ్యులకు 12వ ఏడున ఉపనయనం చేయాలి. బ్రాహ్మణులకు చైత్ర మరియు వైశాఖ మాసాలు, క్షత్రియులకు జ్యేష్ట, ఆషాఢ మాసాలూ, వైశ్యులకు ఆశ్వయుజ కార్తీక మాసాలు మంచిది. అందరికీ పనికివచ్చే మాసాలు మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలు. బ్రహ్మచారులలో బ్రాహ్మణులు జింక తోలుని, క్షత్రియులు కురుమృగ చర్మమును, వైశ్యులు గొర్రె తోలును, ఉత్తరీయంగా ధరించాలి. బ్రాహ్మణుడు నార బట్టలు, క్షత్రియుడు వెల్వెట్టు బట్టలు, వైశ్యుడు ఉన్ని బట్టలు ధరించాలి. బ్రాహ్మణుడైన బ్రహ్మచారి ముంజకసువుతో పేనిన సమానమైన మూడు పేటలుగల మొలత్రాడు కట్టాలి. క్షత్రియ బ్రహ్మచారి ముర్వ అని కసుపుతో చేయబడిన మొలత్రాడు కట్టాలి. వైశ్యుడు జనపనారతో చేసిన ముప్పేట గల మొలత్రాడు కట్టాలి. ముంజకసుపు దొరకనప్పుడు దర్భ, రెల్లు, తుంగ నీటితో ముప్పెరిగా చేసిన ఒక ముడి,

* హరిద్వార్ అర్ధ కుంభమేళా ప్రారంభం

ఉ త్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌లో గురువారం మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన అర్ధ కుంభమేళా ఏప్రిల్‌ 22 వరకు కొనసాగనుంది. ప్రపంచంలో మరేది సాటిరాని ఒక విశిష్ట ఆధ్యాత్మిక సమ్మేళనం కుంభమేళా. ఈ సందర్భంగా లక్షలాది హిందువులు పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు చేస్తారు. పురాణాల్లోని దేవ దానవుల క్షీరసాగర మథనం, అమృతోద్భవ ఘట్టంతో కుంభమేళా నేపథ్యం ప్రారంభమవుతుంది. అసురులకు అమృతం దక్కకుండా దేవతలు దాన్ని ఒక కుంభం(కుండ)లో దాచిపెడతారు. అమృతం కోసం దానవులు దేవతలను వెంటబడి తరుముతారు. ఈ క్రమంలో కుండ నుంచి కొన్ని అమృతం చుక్కలు భూమిపై ఉన్న హరిద్వార్‌, ప్రయాగ(అలహాబాద్‌), ఉజ్జయిని, నాసిక్‌లలో పడ్డాయంటారు. అందుకే ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో 12 ఏళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. అయితే హరిద్వార్‌, ప్రయాగ(అలహాబాద్‌)ల్లో మాత్రమే కుంభమేళా అనంతరం ఆరేళ్లకు అర్ధకుంభమేళా జరుపుతారు. * పుణ్యస్నానాలకు ముఖ్యమైన రోజులు * జనవరి 14 (గురువారం) మకర సంక్రాంతి * ఫిబ్రవరి 08 (సోమవారం) సోమ్‌వతి అమావాస్య * ఫిబ్రవరి 12 (శుక్రవారం) వసంత పంచమి * ఫిబ్రవరి 22 (సోమవారం) మాఘ పౌర్ణమి * మార్చి 07 (సోమవారం) మహాశివరాత్రి * ఏప్రిల్‌ 07 (గురువారం

ధ్వజస్థంభం

ధ్వజస్థంభంఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం.ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓ కధ ఉంది.భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగాపేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు.మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు

కృష్ణ పరమాత్మ ఎప్పుడు నెమిలిపించం ధరించి కనిపిస్తాడెందుకు?

ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ కృష్ణ పరమాత్మ ఎప్పుడు నెమిలిపించం ధరించి కనిపిస్తాడెందుకు? ఈ సమస్త సృష్టిలో శారీరిక సంపర్కం లేకుండా సంతానం పొందగలిగేది ఒక్క నెమలి మాత్రమేనటుంది శాస్త్రం. మగనెమలికి పించం ఉంటుంది. మేఘాలు పట్టి వర్షం పడే సమయంలో మగనెమలి ఆనందంతో నాట్యం చేస్తుంది, ఆ సమయంలో మగనెమలి కంటి నుంచి పడే బిందువులను ఆడనెమలి వచ్చి త్రాగుతుంది. ఆ నీటిని త్రాగడం చేత ఆడనెమలి గర్భం ధరిస్తుందట. ఎటువంటి శారీరిక సంబంధం లేకుండా జరుగుతుంది ఈ ప్రక్రియ. శ్రీ కృష్ణుడు యోగి. ద్వాపరయుగంలో భూమిపై తిరగాడిన సిద్ధపురుషుడు. అటువంటి శ్రీ కృష్ణుడు తనకు అందరితో ఉన్నది ఆత్మ సంబంధమేనని, ఎవరితోనూ తనకు శారీరిక సంబంధం లేదని, తాను ఒక యోగినని తెలుపడానికే నెమలి పించం ధరించి కనిపిస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ

దారిద్ర్య దహన శివ స్తోత్ర

దారిద్ర్య దహన శివ స్తోత్రమ్విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయకర్ణామృతాయ శశిశేఖర ధారణాయ |కర్పూరకాంతి ధవళాయ జటాధరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 1 ||గౌరీప్రియాయ రజనీశ కళాధరాయకాలాంతకాయ భుజగాధిప కంకణాయ |గంగాధరాయ గజరాజ విమర్ధనాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 2 ||భక్తప్రియాయ భవరోగ భయాపహాయఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ |జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 3 ||చర్మాంబరాయ శవభస్మ విలేపనాయఫాలేక్షణాయ మణికుండల మండితాయ |మంజీరపాదయుగళాయ జటాధరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివ ాయ || 4 ||పంచాననాయ ఫణిరాజ విభూషణాయహేమాంకుశాయ భువనత్రయ మండితాయఆనంద భూమి వరదాయ తమోపయాయ |దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 5 ||భానుప్రియాయ భవసాగర తారణాయకాలాంతకాయ కమలాసన పూజితాయ |నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 6 ||రామప్రియాయ రఘునాథ వరప్రదాయనాగప్రియాయ నరకార్ణవ తారణాయ |పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 7 ||ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయగీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ |మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 8 ||వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణ

లక్ష్మీ శ్లోకాలు

ఆదిలక్ష్మీ : సుమనసవందిత సుందరి మాధవిచంద్ర సహోదరి హేమమయేమునిగణ మండిత మోక్షప్రదాయినిమంజుల భాషిణి వేదనుతే !వంకజవాసిని దేవ సుపూజితసద్గుణ వర్షిణి శాంతియుతేజయ జయహే మధుసూదన కామినిఆదిలక్ష్మీ సదా పాలయమాం !! ధాన్యలక్ష్మీ : అయికలి కల్మష నాశిని కామినివైదిక రూపిణి వేదమయేక్షీర సముద్భవ మంగళ రూపిణిమంత్రి నివాసిని మంత్రనుతే !మంగళదాయిని అంబుజావాసినిదేవగణాశ్రిత పాదయుతేజయజయహే మధుసూదన కామినిధాన్యలక్ష్మీ సదా పాలయమాం !! ధైర్య లక్ష్మీ : జయవరవర్ణిని వైష్ణవి భార్గవిమంత్రస్వరూపిణి మంత్రమయేసురగుణ పూజిత శ్రీఘ్ర ఫలప్రదజ్ఞాన వికాసిని శాస్త్రనుతే !భవ భయహారిని పాప విమోచినిసాధు జనాశ్రిత పాదయుతేజయ జయహే మధుసూదన కామినిధైర్యలక్ష్మీ సదా పాలయమాం !! గజలక్ష్మీ : జయ జయ దుర్గతి నాశిని కామినిసర్వ ఫలప్రత శాస్త్రమయేరథ గజ తురగపదాది సమావృతపరిజన పండిత లోకనుతే!హరిహర బ్రహసుపూజిత సేవితతాప నివారిణి పాదయుతేజయ జయహే మధుసూదన కామినిగజలక్ష్మీరూపేష పాలయమాం !! సంతానలక్ష్మీ : అయి ఖగవాహిని మోమిని చక్రిణిరాగ వివర్థిని జ్ఞానమయేగుణగణవారిధి లోకహీతైషిణిస్వరసప్త భూషితగాననుతే !సకల సురాసుర దేవ మునీశ్వరమనవ వందిత పాదయుతేజయ జయహే మధుసూదన కామినిసంతానలక

*కుటుంబ గొడవలు హరించుటకు*

శ్రీ మహా గణపతి అనుగ్రహ స్తోత్రముభార్యాభర్తల మధ్య గొడవలు గాని, అన్నదమ్ముల మధ్యగొడవలు గాని, తల్లిదండ్రుల బిడ్డల మధ్య గొడవలు గాని,సమసి పోవుటకు ఈ స్తోత్రమును ప్రతి రోజు ఉదయం,సాయంత్రం చదివిన చో అద్భుతమైన ఫలితమును ఇచ్చి ,కుటుంబం లో ప్రేమానురాగాలు వెల్లి విరియును......."శ్లో" సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురంగృహీత పాశకాంకుశం వరప్రదా భయప్రదం |చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతనంప్రపుల్ల వారిజాసనం భజామి సింధురాననమ్||"శ్లో" కిరీటహారకుండలం ప్రదీప్త బాహు భూషాణంప్రచండరత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికం |ప్రభాతసూర్య సుందరాంబరద్వయ ప్రధారిణంసరత్న హేమనూపుర ప్రశోభితాంఘ్రి పంకజం||"శ్లో" సువర్ణ దండమండిత ప్రచండ చారు చామరంగృహప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం|కవీంద్ర చిత్తరంజకం మహా విపత్తి భంజకంషడక్షర స్వరూపిణాం భజే గజేంద్ర రూపిణం||"శ్లో" విరించి విష్ణు వందితం విరూప లోచనంశుభంగిరీశ దర్శనేచ్ఛయా సమర్పితం పరాంబయా |నిరంతరం సురాసురైః సపుత్ర వామలోచనైఃమహామఖేష్ట కర్మసు స్కృతం భజామితుందిలమ్||~~~~~~ సర్వే జనాః సుఖినో భవంతు ~~~~~~

ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ?

ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి ?ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.నూతన వధూవరులు తొలిసారి భోజ

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా…?

పండుగలైనా.. ఫంక్షలైనా ముందుగా ఆడవారు గోరింటాకుకే ప్రాధాన్యత ఇస్తారు.ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు.. కోన్స్ లాంటివి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కానీ.. ఇదివరకటి రోజుల్లో ప్రతి ఇంటి పెరట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది.ఆషాఢంలో గోరింటాకుకు చాలా ప్రత్యేకత ఉంది. ఆషాఢమాసం వచ్చేస్తోంది .. అనగానే ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగా మెరిసిపోతుంటాయి.ఈ మాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం మన సంస్కృతిలో ఉంది.అసలు దీని వెనుక ఉన్న మర్మమేంటో..  మీకు తెలుసా..?ఆషాఢమాసంతో గ్రీష్మరుతువు పూర్తిగా వెళ్లిపోయి.. వర్షరుతువు ప్రారంభమౌతుంది.గ్రీష్మంలో మన శరీరంలో బాగా వేడి పెరుగుతుంది. ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడిపోతుంది.. మన శరీరంలో ఉన్న వేడి.. బయట చల్లబడిన వాతావరణం పరస్పర విరుద్ధం కాబట్టి అనారోగ్యాలు మొదలౌతాయి.గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి ఉంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అందువల్లే మన ప్రాచీనులు గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు.మహిళలు.. ఈ ఆషాడంలో అందంతో పాటు..ఆరోగ్యాన్నిచ్చే గోరింటను మీఅరచేతుల నిండా నింపుకోండి.....

బిల్వనిలయా

లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టినది. ఆమెను 'బిల్వనిలయా' అని పిలుస్తారు. * బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సూర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టించుతారు.మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే, శివుడికి అతిప్రీతికరమైన పత్రము.మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది.మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. అతిసార వ్యాధి కి దీని పండ్ల రసాయనం చాలా మంచి మందు. ఆయుర్వేదము లో వాడు దశమూలము లలో దీని వేరు ఒకటి. మొలలకు ఇది మంచి ఔషధము. దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడ పనిచేస్తుంది.సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది

లింగాష్టకం యొక్క అర్థం మీకు తెలుసా..??

బ్రహ్మ మురారి సురార్చిత లింగంబ్రహ్మ ,విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం..!!నిర్మల భాషిత శోభిత లింగం,నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం..!!జన్మజ దుఃఖ వినాశక లింగం,జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం..!!తత్ ప్రణమామి సదా శివ లింగం,ఓ సదా శివ లింగం నీకు నమస్కారం..!!దేవముని ప్రవరార్చిత లింగందేవమునులు ,మహా ఋషులు పూజింప లింగం..!!కామదహన కరుణాకర లింగం,మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం..!!రావణ దర్ప వినాశక లింగం,రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం..!!తత్ ప్రణమామి సద శివ లింగం,నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!సర్వ సుగంధ సులేపిత లింగం,అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం..!!బుద్ధి వివర్ధన కారణ లింగం,మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ..!!సిద్ధ సురాసుర వందిత లింగం,సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం..!!తత్ ప్రణమామి సదా శివ లింగం,నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!కనక మహామణి భూషిత లింగం,బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం..!!ఫణిపతి వేష్టిత శోభిత లింగం,నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శి

బల్లి శాస్త్రం :

బల్లి మన పై పడితే ఫలితము, ఏ విధముగా ఉండే అవకాసం ఉన్నది: శిరస్సు = కలహం ముఖము నందు =బంధు దర్సనం కనుబొమ్మల నడుమ = రాజాను గ్రాహం పైపెదవి =ధన వ్యయం క్రింది పెదవి = ధన లాభం ముక్కు చివర =రోగము కుడి చెవు = దేర్ఘాయువు ఎడమ చెవి =వ్యాపార లాభం నేత్రాల యందు = శుభం గడ్డం నందు =రాజ దండనము నోటి మీద = ఇస్టాన్న భోజనం మెడ యందు = పుత్రా జననం దవడల మెడ =వస్త్ర లాభం కంఠము నందు = శత్రువు కుడి భుజం =ఆరోగ్యం ఎడమ భుజం =స్త్రీ సంభోగం, ఆరోగ్యం కుడి ముంజేయి = కీర్తి ఎడమ ముంజేయి =రోగం హస్తం = ధన లాభం కనుల మీద =శుభం చేతి గొళ్ళ యందు = ధన నాశనం మోకాళ్ళు =స్త్రీ, ధన లాభము పిక్కల యందు =శుభము మదములు =శుభము స్తన భాగం =దోషం ఉదరం = ధన్య లాభం రొమ్ము, నాభి =ధన లాభం పాదం = ప్రయాణం కాలి గోళ్ళు= నిర్లజ్జ లింగం = దారిద్యం జుట్టు కోన =మృత్యువు దేహము పై పరిగెడితే = దేర్ఘాయువుమీద పడి, వెను వెంటనే వెళిపోతే, దానంతట అది =మంచిదిపురుషులకుతలమీద కలహంపాదముల వెనక ప్రయాణముకాలివ్రేళ్లు రోగపీడపాదములపై కష్టముమీసముపై కష్టముతొడలపై వస్త్రనాశనముఎడమ భుజము అగౌరవముకుడి భుజము కష్టమువ్రేళ్ళపై స్నేహితులరాకమోచేయి ధనహానిమణిక

వివాహమెందుకు?

వివాహమెందుకు?:ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. దీనికి సమాధానం ప్రతివారూ తెలుసుకోవాలి. ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు.1. ఋషిఋణం, 2. దేవఋణం, 3. పితౄణం....ఈ ఋణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ ఋణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు ఋణ విముక్తుడు కావాలి. దానికి ఏంటి మార్గం? మన పెద్దలు చెప్పారు - "బ్రహ్మచర్యేణ ఋషిభ్యః" " యజ్ఞేన దేవేభ్యః" "ప్రజయా పితృభ్యః" అని.1. ఋషి ఋణం: బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో చేయవలసిన వేదాధ్యయనం చేయాలి. అలాగే పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి.2. దేవఋణం: యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి. నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికి మనమెంతో ఋణపడివున్నాం. కనుక ఆ ఋణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నలం అవుతాం.3. పితౄ

హారతి ఇస్తాము - ఎందుకు?

భగవంతుని ప్రార్ధన, పూజ లేదా భజన చివర్లో లేక గౌరవనీయులైన అతిథిని లేక మహాత్ముడిని ఆహ్వానించేటప్పుడు హారతి ఇస్తాము. ఇదెప్పుడూ ఘంటా నాదం తోను కొన్ని సమయములలో పాటలు ఇతర సంగీత వాయిద్యాలతోను, మరియు చప్పట్లతోను కలిసి ఉంటుంది.ఇది పదహారు అంచెలుగా చేసే షోడశోపచార పూజా కార్యక్రమములోనిఒక భాగము. ఇది శుభసూచకమైనమంగళ నీరాజనముగా సూచింప బడుతుంది. భగవంతుని రూపాన్ని ప్రకాశింప చేయడానికి మనము కుడిచేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో హారతి ఇచ్చేటప్పుడు దీపపు వెలుగులో ప్రకాశించే భగవంతుని సుందర రూపాన్ని ప్రతిభాగము విడిగాను మరియు పూర్తి రూపము శ్రద్ధగా గమనిస్తూ మనసులో గానీ పైకి గట్టిగా గానీ స్తోత్రాలు చదవడము చేస్తాము.ఆ సమయంలో మన ప్రార్ధనలో తపన మరియు భగవంతుని రూపములో ప్రత్యేకమైన సౌందర్యము మనకు అనుభవమవుతుంది.చివరలో ఆ వెలుగు పై మన చేతులనుంచి తరువాత నెమ్మదిగా మన కళ్ళకు తల పైభాగానికి అద్దుకొంటాము.మనము చిన్నప్పటి నుంచీ ఈ ప్రక్రియను చూస్తున్నాము. అందులో పాల్గొంటున్నాము. మనము హారతి ఎందుకు ఇస్తామో తెలుసుకుందాము..ఇష్టపూర్వకముగాభగవంతుడిని పూజించినప్పుడు,అభిషేకం చేసినప్పుడు, అలంకరించినప్పుడు, ఫలములు మరియు మధుర

దీపారాధన========

దీపారాధన========ప్రమిద లేక కుండీలో రెండు వత్తులు వేసి దీపం వెలిగించడం శుభసూచకం. ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మా. శవం తల వెనుక,శ్రాద్దకర్మలప్పుడు ఒకే వత్తి వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్ధం ఇక దీపారాధనలో నూనె శనికి ప్రతినిధి. దీపం సూర్యునికి ప్రతీక, మనకు, మన ఇంటికీ వుండే దోషాల నివారణార్ధం మనకు వెలుగు (తెజస్సు ) కలగాలని, నూనె హరించినట్లే మన కష్టాలు హరించి, వెలుగు రావాలని దీపారాధన ప్రధాన ఉదేశ్యం.* సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా, దీపమున్న ఇంటిలో, దారిద్ర్యముండదు.* దీపాలు తూర్పుముఖంగా వుంటే ఆయువు పెరుగుతుంది.* ఉత్తరదిశ ముఖంగా వుంటే అన్ని విధాలా ధనాభివృద్ధి కలుగుతుంది.* నాలుగు దిక్కులలో ఒకేసారి దీపాలు పెడితే ఏ దోషము వుండదు

బ్రాహ్మి ముహూర్త విశేషాలు:

శ్లోకము: బ్రాహ్మి ముహూర్త ఉతిష్టేత్ స్వస్దో రక్షార్ధమాయుష:| శరీర చింతాం నిర్వర్త్య కృత శౌచ విధిస్తత:|| బ్రాహ్మి ముహూర్తం అనగా సూర్యోదయానికి 96 ని|| ముందు నిద్ర నుండి లేవడము.ఈ సమయమున తన ఆర్యోగ్యాన్ని కాపాడుకోవడానికి సంబంధించిన వ్యాయామం అలాగే తన రోజు వారి కాలకృత్యాలు తీర్చుకొని దైవరాధనకి మంచి సమయముగా సూచించబడినది .దీనికి సంధించిన శ్లోకము శాస్త్రమునన్ధు నిర్దేసిన్చడమయినది. సర్వేజన సుఖోన భవంతు!!!!! .ఓం శాంతి:శాంతి:శాంతి:

గోత్రము

గోత్రమంటే నిజానికి ’ గోశాల’ అని అర్థము. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ’ గోత్రము ’ అని పిలిచేవారు. కాల క్రమేణా ఆ పదానికి అర్థంమారి, ఒక వంశమువారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి ( ఋషి యొక్క) పేరునే వారి గోత్రముగా పిలవడము మొదలైంది. ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కానీ నాకు వ్యక్తిగతం గా తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో ఉన్నారు. అంతే కాదు, వివిధ వర్ణాలలో కూ డా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు , ఇవి క్షత్రియ గోత్రాలు , ఇవి వైశ్య గోత్రాలు ..... ఇలా ఉన్నప్పటి కీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలసి ఉండటానికి కింద రాసినది చదివితే కొంతవరకు బోధ పడవచ్చు... సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే ! విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆ యా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలక్షల కొలది లెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోన

నూతన యజ్ఞోపవీత ధారణ విధి & నిత్య త్రికాల సంధ్యా వందనము

నూతన యజ్ఞోపవీత ధారణ విధి & నిత్య త్రికాల సంధ్యా వందనము నూతన యజ్ఞోపవీత ధారణ విధి గణేశ స్తోత్రం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే || గురు శ్లోకం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః || సరస్వతీ శ్లోకం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా |యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా | ఆచమన౦ ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య) ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా) ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా) ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య) ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య) ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య) ఓం దామోదరాయ నమః (శిరసి జ