బ్రాహ్మి ముహూర్తం

బ్రాహ్మి ముహూర్తం లో ఎందుకు లేవాలి?పెద్దలు అందరు చెప్తూ ఉంటారు-----బ్రాహ్మి ముహూర్తం లో నిద్ర లేవాలి అని. అలా ఎందుకు. అసలు బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి? సుర్యొదయమునకు 48 నిముషముల ముందు ఉన్న సమయమును బ్రాహ్మి ముహూర్తం అంటారు. అంటే రాత్రిభాగము లోని ఆఖరి 48 నిముషములు అన్నమాట. ఈ సమయము పూజలకు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయముగా చెప్తారు.ముఖ్యంగా విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తం లో లేచిచదువుకుంటే చదువు బాగా వస్తుంది అని అంటారు. దేనికి వెనుక ఏదైనా రహస్యంఉందా? అంటే విశ్లేషిస్తే పెద్దగా ఏమి లేదు. మన శరీరం లో ఒక జివ గడియారం ఉంటుంది. (virtual clock ) దీనిని అనుసరించే మన జీవక్రియలు అన్ని జరుగుతాయి. ఆ ప్రకారం ఉదయపు వేళల్లో మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడి ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. అందువలన ఆ సమయములో చదువుకుంటే పిల్లలకు మంచిది. చదివిన పాఠాలన్నీ చక్కగా గుర్తు ఉంటాయి. అంతకు ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాము కాబట్టి మెదడు ఉత్తేజం తో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దం గా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.మరి పెద్దవాళ్ళు ఎందుకు లేవాలి? ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయం ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు. ఎందుకంటే ఉదయాన్నే ప్రక్రుతి ఎంతో అందంగా ఉంటుంది. చెట్లు ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని మనందరకూ తెలుసు.రాత్రంతాచెట్లు విడిచిన ఆక్సిజన్ వేకువన కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లోమనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాల ఉపయోగ పడుతుంది.మరి గృహిణులు ఎందుకు లేవాలి? ఇది అందరకు తెలిసినదే. గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు. పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారిసంరక్షణ, వంటపనులు, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు వారు రోజంతా. అటువంటి వారికీ ఒత్తిడి లేని జీవన విధానం, మానసిక , శారీరిక ఆరోగ్యం చాల అవసరం. బ్రాహ్మి ముహూర్తం లో లేవటం వలన మానసిక ఒత్తిడులు తగ్గుతాయి, శారీరిక ఆరోగ్యం కూడా సమకూరుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఏంటంటే, వేకువనే లేవడం వలన ఇంటి పనులు అన్ని ఒక పద్దతిగా ఆందోళన లేకుండా చేసుకోవడానికి వీలు అవుతుంది. గందరగోళం లేకుండా ఉంటుంది. పనులు ఒక క్రమశిక్షణతో జరుగుతాయి. ప్రతిరోజూ సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి హృదయం, మెదడు, ప్రశాంతంగా ఉంటాయి.బ్రాహ్మి ముహూర్తం లో లేవడం వలన ఇంకొక మేలు ఏమిటంటే, సూర్యుని లేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి. సూర్యరశ్మి లో డి విటమిన్ ఉంటుంది అని అందరికి తెలుసు, ఎముకల పటుత్వానికి ఇది ఎంతో అవసరం. ఇదివరకు మాములు ఇల్లు ఉన్నపుడు ఏదో ఒకవేపునుంచి ఎండ ఇంట్లోకి వచ్చేది. ఈనాడు అంతా apartmentculture కదా. కొన్ని ఇళ్ళల్లో సూర్యోదయం కనిపించదు. అటువంటివారికి డి విటమిన్ లోపం వచ్చే అవకాసం ఉంది. కొన్ని చర్మ వ్యాదులకు కూడా సూర్యరశ్మి మేలు చేస్తుంది. అటువంటి వారు ఉదయం , సాయంత్రం కొన్ని నిముషాలు సూర్య కిరణాలు తమకు సోకేటట్టుగా లేత ఎండలో నుంచోవడం ఎంతో మంచిది.మనం తొందరగా లేస్తే, పిల్లలు కూడా మనలను చూసి లేవడం అలవాటు చేసుకుంటారు.వారికీ కూడా క్రమశిక్షణ అలవాటు అవుతుంది. మన పూర్వులు ఏమి చెప్పినా, మన మంచికే చెప్పారు. వారు చెప్పిన సూత్రాల వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మనకు ఎప్పుడూ మేలే జరుగుతుంది.

Comments

Popular posts from this blog

Jambu dweepe bharata varshe Abstract

SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM

నూతన యజ్ఞోపవీత ధారణ విధి & నిత్య త్రికాల సంధ్యా వందనము