శివాభిషేక ఫలములు
ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు.....!!ఈ విషయంపై శివపురాణం ఓసారి తిరగేస్తే.. అందులో శివుడు ఎనిమిది రూపాలు ధరించినట్టు పేర్కొంటోంది.అవేంటంటే...రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అధిష్టించి ఉంటాడు.శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు.భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైనజలాన్ని ఆశ్రయించి ఉంటాడు.ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడైన వాయువును అధిష్టించి ఉంటాడు.భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు.పశుపతి : సంసారబద్ధులైన జీవులను పాపవిముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు.ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునిలో ప్రకాశిస్తుంటాడు.మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు.శివాభిషేక ఫలములు......1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు – పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది(మెత్తుట) పూజ చేయుదురు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.
Comments
Post a Comment